UGC – అసిస్టెంట్ ప్రొఫెషర్ ఉద్యోగాలకు పీహెచ్డీ తప్పనిసరి కాదు

న్యూడిల్లీ (జూలై – 05) : ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష పద్దతిలో భర్తీ చేసేటప్పుడు పిహెచ్డీ‌ తప్పనిసరి కాదు అప్షనల్ అని, నెట్, సెట్, స్లెట్ వంటి అర్హతలు కనీస అర్హతలుగా UGC నోటిఫికేషన్ జారీ చేసింది. (PhD is optional and NET, SET, SLET is minimal criteria for assistant professor posts from July 1st 2023)

ప్రత్యక్ష పద్ధతిలో నియమించే అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పిహెచ్డీ ని కనీస అర్హతగా పరిగణించాల్సిన అవసరం లేదని నెట్, సెట్, స్లెట్ లను కనీస అర్హతగా పేర్కొనవచ్చు అని పేర్కొంది.

అలాగే విద్యా సంస్థలు ఈ నిబంధనను పాటించడం, పాటించకపోవడం అనేది నిర్ణయించుకునె స్వేచ్ఛ వారికి ఇస్తున్నట్లు పేర్కొంది.