BIKKI NEWS (AUG. 23) : PhD Admissions with UGC NET Score. తెలంగాణ రాష్ట్రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు ఎంట్రెన్స్ టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే పీహెచ్డీ ప్రవేశాలు కల్పిసారు.
ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. జేఆర్ఎఫ్ కు 50%, నెట్ ఉత్తీర్ణత సాదించిన వారికి 50% సీట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
PhD Admissions with UGC NET Score
కొద్ది రోజుల క్రితం పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ప్రకటన చేసింది. 2024 -25 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సుల్లో యూజీసీ నెట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసింది.
ఇప్పటి వరకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు పీహెచ్‌డీ అడ్మిషన్లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించాయి. మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలు యూజీసీ – నెట్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించాయి. జేఎన్టీయూతో పాటు ఓయూలోని సాంకేతిక కోర్సులు యూజీసీ నెట్‌లో లేకపోవడంతో వీటికి మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే ఓయూలో జేఆర్‌ఎఫ్ అడ్మిషన్లు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.