IPL 2024 – పంజాబ్ రికార్డు రన్ ఛేజ్

BIKKI NEWS (APRIL 26) : ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 262 పరుగుల లక్ష్యంను సునాయాసంగా (PBKS BEATS KKR BY RECORD RUN CHASE) చేధించింది.

ఐపీఎల్ చరిత్ర లోనే అతి పెద్ద రన్ ఛేజ్ ను పంజాబ్ సాదించి రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్ లో ఏకంగా 42 సిక్సర్ లు నమోదు కావడం విశేషం. కేకేఆర్ జట్టు 18 సిక్సర్ లు కొడితే, పంజాబ్ జట్టు ఏకంగా 24 సిక్సర్ లు కొట్టడం విశేషం.

262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో జట్టు జానీ బెయిర్‌స్టో అజేయ సెంచరీ (108) శశాంక్ సింగ్ (68*), ప్రభుసిమ్రాన్ సింగ్ (54) రాణించడంతో 18.4 ఓవర్ లోనే సంచలన విజయం సాధించింది.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో సాల్ట్ – 75, నరైన్ – 71, వెంకటేష్ అయ్యర్ – 39 పరుగులతో రాణించడంతో 261/6 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది.

బెయిర్‌స్టో 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ.