PRC 2020 : జీవోలు విడుదల

BIKKI NEWS : తెలంగాణరాష్ట్రంలోని ప్రభుత్వ/ కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు (PRC 2020) చేస్తూ శుక్రవారం మొత్తం 10 జీవోలను విడుదల చేసింది.

ఈ మేరకు వేతన స్కేళ్లను సవరించింది. దీంతో 2018 జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి.

  • ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
  • ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది.
  • 2018 జులై వరకు ఉన్న డీఏ 30.39 శాతం మూలవేతనంలో కలవనున్నది.
  • 2020 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగులకు మానిటరీ లబ్ధి చేకూరనుంది.
  • బకాయిలను పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించనుంది.
  • ఏప్రిల్‌, మే బకాయిలను సైతం ఈ ఏడాదే ప్రభుత్వం చెల్లించనుంది.
  • జూన్‌ నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి.
  • కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నూతన వేతనాలు చెల్లించనున్నారు
  • ఏప్రిల్,మే నెల బకాయిలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.
  • 01.04.20 నుండి 31-03-21 వరకు బకాయిలు ఉద్యోగి రిటైర్‌మెంట్‌ తర్వాత ఇస్తారు.
  • HRA తగ్గించారు. (24/17/13/11)
  • జులై 1,2018 న ఉద్యోగి మూలవేతనం ఆధారంగానే నూతన వేతనం ఫిక్సేషన్‌.
  • రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు