Home > TELANGANA > 223 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

223 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

BIKKI NEWS (AUG. 14) : NEW GRAM PANCHAYATHIES IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

NEW GRAM PANCHAYATHIES IN TELANGANA

223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతి పాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోదించాయి. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పంచాయతీలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 12,992 పంచాయతీలకు చేరాయి.

వీటిలో ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామాల సంఖ్య 12,991కు చేరింది.

ఈ నూతన పంచాయతీల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త పంచాయతీల సమాచారాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలకు చేరవేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు