NEDvsAFG : అప్ఘనిస్తాన్ ఘన విజయం

లక్నో (నవంబర్ – 03) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్, అప్ఘనిస్తాన్ (NEDvsAFG) జట్ల మద్య లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు రనౌట్ అయింది.. అప్ఘనిస్తాన్ జట్టు 7 వికెట్లతో ఘన విజయం సాదించి…. సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకుంది.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘనిస్తాన్ అస్మతుల్లా – 56, రహమత్ షా – 52 పరుగులతో రాణించడంతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 4 గురు బ్యాట్స్‌మన్ రనౌట్ రూపంలో వెనుదిరగడం తో 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లెబెత్ – 58 , ఒడ్వాడ్ – 48, అకర్‌మాన్ – 29 మాత్రమే రాణించారు. ఔ ముగ్గురు కూడా రనౌట్ గా వెనుదిరగడం విశేషం. అప్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ – 3, నూర్ అహ్మద్ – 2 , ముజీబుర్ రేహ్మాన్ – 1 వికెట్ తీశారు.

అప్ఘనిస్తాన్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాదించడంతో పాకిస్థాన్ జట్టు యొక్క సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారాయి. నెదర్లాండ్స్ జట్టు ఓటమి తో సెమీస్ ద్వారాలు పూర్తిగా సన్నగిల్లుతాయి.