JNTU జగిత్యాల కు అటానమస్ హోదా – UGC

హైదరాబాద్ (జూన్ – 03) : జేఎన్టీయూహెచ్ సంబంధించిన జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలకు పదేళ్లపాటు యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా దక్కింది. విశ్వవిద్యాలయం పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన యూజీసీ స్టాండింగ్ కమిటీ 2023-24 నుంచి 2032 – 2033 వరకు అటానమస్ గుర్తింపు ఇచ్చింది. (jntu-jagtial-engineering-college)

దీనివల్ల సొంతంగా సిలబస్ రూపొందించుకోవడం, పరీక్షలు నిర్వహించుకొని ఫలితాలు ఇచ్చుకోవడం వంటి పలు ప్రయోజనాలు పొందొచ్చు. ఇప్పటివరకు జేఎన్టీయూహెచ్ నుంచి ఆ ప్రక్రియ అంతా జరుగుతోంది.