BIKKI NEWS : హమాస్ (Hammad) అనే పాలస్తీనా (Palestine) అనుకూల సంస్థ ఒక్కసారిగా దాదాపు వందల రాకెట్లతో ఇజ్రాయిల్ (Israel) దేశం మీద దాడి చేయడంతో మరొక్కసారి పాలస్తీనా – ఇజ్రాయిల్ భారీ ఘర్షణలు యుద్ధంగా (IsraelPalestineWar) మారాయి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించలేక ప్రపంచం చేతులెత్తేసిన నేపథ్యంలో.. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం తెరమీదకు రావడం విచారకరం.
★ పాలస్తీనా చరిత్ర (Palestine History)
మధ్యధరా సముద్రానికి మరియు జోర్డాన్ నదికి మధ్యలో ఉన్న ప్రాంతమే పాలస్తీనా ఇందులోని జెరూసలేం పట్టణం అటు క్రైస్తవులకు ఇటు ముస్లింలకు పవిత్ర పట్నము> ఈ ప్రాంతంలో యూదులు మైనారిటీలుగా, అరబ్బులు మెజారిటీ ప్రజలుగా ఉండేవాళ్ళు. 1914 వరకు ఒటోమాన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా పాలస్తీనా ప్రాంతం ఉండేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో 1914 బ్రిటన్ దేశం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో బ్రిటన్ వలస దేశంగా 1948 వరకు ఈ ప్రాంతం ఉండేది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్ లో యూదుల మీద దాడులు పెరగడంతో యూదులందరూ పాలస్తీనా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో ఇక్కడ యూదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీంతో పాలస్తీనా ప్రాంతాన్ని యూదు దేశంగా ప్రకటించాలని డిమాండ్ పెరిగిపోయింది మ. అటు అరబ్బులు దీనిని అడ్డుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది జాతుల మధ్య వైరంగా ప్రారంభమైంది.
★ ఐరాస – పాలస్తీనా విభజన (UN DEVISION OF PALESTINE)
1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనా ప్రాంతాన్ని యూదు దేశం, అరబు దేశాలుగా విభజించాలని ఇరువర్గాలకు పవిత్రమైన జెరూషలేమును అంతర్జాతీయ పట్టణంగా ఎవరికీ కేటాయించకుండా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ విభజనను యూదులు అంగీకరించినప్పటికీ అరబ్బులు అంగీకరించలేదు దీంతో వైరం మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు ఆ జెరూసలేం పట్టణం కొరకు, పాలస్తీనా ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యం కొరకు యూదులు అరబ్బులు నిరంతరం దాడులు జరుపుతూనే ఉన్నారు అప్పటినుండి ఈ సమస్య ఏ అంతర్జాతీయ సంస్థ పరిష్కరించలేకపోయింది.
★ ఇజ్రాయెల్ ఆక్రమణలు : (Israel formation)
1948 తర్వాత యూదు ప్రాంతాన్ని ఇజ్రాయిల్ పేరుతో యూదు నేతలు ఏర్పరచుకొని మెల్లగా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి దాడులు తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో 1967 వరకు తూర్పు జెరోషలెం ప్రాంతం, వెస్ట్ బ్యాంక్, సిరియన్ గోలెన్ హైట్స్, గాజా, ఈజిప్టు యొక్క సినాయి దీపకల్పంపై ఇజ్రాయిల్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఈజిప్టు, సిరియాలు కూడా ఇజ్రాయెల్ పై గుర్రుగా ఉన్నాయి.
◆ 1973 యుద్ధం (యామ్ కిప్పూర్ యుద్ధం – రామ్‌ధాన్ యుద్దం) (Yam Kippur War)
అయితే 1973 అక్టోబర్ లో ఒకవైపు నుంచి ఈజిప్ట్, మరోవైపు నుంచి సిరియా ఇజ్రాయిల్ మీద ఒకేసారి తీవ్ర దాడి చేశాయి. అనుకోని ఈ యుద్ధంతో ఇజ్రాయిల్ మొదట్లో బెంగపడిన చివర్లో అమెరికా సహాయంతో పై చేయి సాధించినప్పటికీ మధ్యవర్తిత్వం కారణంగా సీనాయ్ ద్వీపాన్ని ఈజిప్టుకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఇజ్రాయిల్ ను చట్టబద్ధ దేశంగా గుర్తించింది.
★ హమాస్ సంస్థ : (Hammas Group)
ప్రస్తుతం పాలస్తీనా అనుకూల సంస్థ హమాస్ గాజా ప్రాంతంలో సైనిక ప్రభుత్వాన్ని నడుపుతుంది ఇప్పుడు దాడి చేసింది కూడా ఈ హమాస్ గ్రూపే. పాలస్తీ నా ప్రాంతం నుండి యూదులను పూర్తిగా నిర్మూలించి పాలస్తీనాను పూర్తిస్థాయి అరబు దేశంగా మార్చడమే ఈ సమస్త ప్రధాన లక్ష్యం.