BIKKI NEWS (JUNE 18) : IPO 2024 UPDATES. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడం ఏ కాక భారీగా నిధులు సమకూర్చుకోవడానికి అన్లిస్టెడ్ దిక్కజ కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇందుకోసం సిబికి తమ దరఖాస్తును చేసుకుంటున్నాయి.
ఐపీవో లిస్టింగ్ కోసం హ్యుందాయ్, స్విగ్గీ, బజాజ్ హౌసింగ్, ఆప్కన్స్ ఇన్‌ప్రా, ఓలాఎలక్ట్రిక్, ఎన్‌ఎస్‌డీఎల్, వరీ ఎనర్జీస్ వంటి ముఖ్యమైన కంపెనీలు క్యూ కడుతున్నాయి.
దక్షిణ కొరియా మోటార్ వాహనాల దిగ్గజ కంపెనీ అయినా హ్యూందాయ్ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ కొరకు సెబికి దరఖాస్తు చేసుకుంది. దీని ద్వారా 25 వేల కోట్ల రూపాయలను సమీకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసి ఐపిఓ విలువ 21 వేల కోట్లు కాగా ఆ రికార్డును హ్యుందాయ్ చెరిపివేయనుంది. ఒకవేళ హ్యుందాయ్ ఐపిఓ లిస్ట్ అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపివోగా రికార్డు సృష్టించనుంది.
IPO 2024 UPDATES
HYUNDAI IPO – 25 వేల కోట్లు
BAJAJ HOUSING IPO – 7 వేల కోట్లు
SWIGGY IPO – 8 వేల కోట్లు
OLA ELECTRIC IPO – 5 వేల 500 కోట్లు
NSDL IPO – 4 వేల 500 కోట్లు
VAREE ENERGIES IPO – 3 వేల కోట్లు
OFKONS INFRA IPO – 7 వేల కోట్లు
ఇదిగాక ఇప్పటికే 2024లో 8 కంపెనీలు ఐపిఓ కి రాగా 14,600 కోట్ల రూపాయలను సమీకరించుకున్నాయి. ఈ ఐపివోలు అన్ని కార్యరూపం దాలిస్తే దాదాపు 60 వేల కోట్ల రూపాయలను మార్కెట్లు సమకరించుకోనున్నాయి.
ఇప్పటికే రికార్డు స్థాయిలకు చేరిన భారత స్టాక్ మార్కెట్లు ఈ ఐపిఓలతో మరింత గరిష్ఠాలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ (BSE) 77 వేల మార్కును, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) 23,500 మార్కును తాకిన విషయం తెలిసిందే.