Home > SPORTS > IPL @ 83 వేల కోట్లు

IPL @ 83 వేల కోట్లు

BIKKI NEWS (DEC. 14) : INDIAN PREMIER LEAGUE BRAND VALUE 83 THOUSAND CRORES – IPL బ్రాండ్ విలువ 10 బిలియన్ డాలర్ల దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుందని బ్రాండ్ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్ ఫినాన్స్ రివీల్స్ ఈ నివేదికను వెల్లడించింది.

ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 83,353 కోట్లు)గా ఉంది. 2022 (8.4 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఆ విలువ 28 శాతం పెరిగింది. ఇక ఐపీఎల్ ఆరంభమైన 2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది.

మీడియా హక్కుల కింద 6.2 బిలియన్ డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంచైజీలు కొత్తగా చేరడం, కొవిడ్ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్ విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది.

ఫ్రాంచైజీల విలువ.
  1. ముంబయి ఇండియన్స్ 87 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 725 కోట్లు),
  2. చెన్నై సూపర్ కింగ్స్ 81 మిలియన్ డాలర్లు (రూ.675 కోట్లు),
  3. కోల్‌కతా నైట్ రైడర్స్ 78.6 మిలియన్ డాలర్లు (రూ.655 కోట్లు),
  4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 69.8 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి.