INTERMEDIATE TRANSFERS SCHEDULE – ఇంటర్ విద్యా బదిలీ షెడ్యూల్

BIKKI NEWS (JULY 17) : INTERMEDIATE EDUCATION TRANSFERS SCHEDULE and GUIDELINES 2024. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో, ఉన్నత విద్యాశాఖ ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీల కొరకు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్య మండలి ఇంటర్ విద్యలో బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

INTERMEDIATE EDUCATION TRANSFERS SCHEDULE and GUIDELINES 2024

జూలై 16 – 17 : ఉన్నత విద్యా శాఖా బదిలీ ఉత్తర్వులు విడుదల

18 – 20 జూలై : ఆన్లైన్ పద్దతిలో బదిలీలకు దరఖాస్తు చేసి, దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసి, సంబంధించిన సర్టిఫికెట్ లు జతచేసి ప్రిన్సిపాల్ చేత వెరిఫికేషన్ చేయించుకోవాలి. తదనంతరం రెండో దశ వెరిఫికేషన్ డీఐఈవో కార్యాలయంలో జరుగును.

జూలై 21 – 23 : వెకెన్సీ లిస్ట్ విడుదల. అభ్యంతరాలు స్వీకరణ, అర్హులైన వారి జాబితా విడుదల.

జూలై 24 – 27 : అర్హులైన వారి జాబితా పై అభ్యంతరాల స్వీకరణ. DIEO/RJD స్థాయిలో అభ్యంతరాల పరిశీలన. ఫైనల్ అర్హులైన జాబితా విడుదల. వెబ్ ఆప్షన్స్ ఎంపిక

జూలై 28 – 29 : ప్రొవిజినల్ అలాట్మెంట్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం.

జూలై 30 – 31 : ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు అందజేత

మార్గదర్శకాలు

జీవో నంబర్ – 80 & 118 ప్రకారం బదిలీలు జరుగుతాయి.

బదిలీ అయిన ఉద్యోగుల 3 రోజుల్లో నూతన స్టేషన్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

జూన్ – 30 – 2024 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపడతారు. 2 సంవత్సరాలు పూర్తి అయిన వారు రిక్వెస్ట్ మీద బదిలీలకు అర్హులు.

ప్రైవేటు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల సిబ్బంది, ఎంటీఎస్ లెక్చరర్స్, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ పోస్టులను ఖాళీగా చూపించాలి.

జూన్ – 30 – 2026 నాటికి పదవి విరమణ పొందు ఉద్యోగులకు 5 సంవత్సరాలు ఒకే స్టేషన్ లో పూర్తి అయిన కూడా వారి రిక్వెస్ట్ మీదనే బదిలీ చేపట్టాలి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు