ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ ‘లా’

హైదరాబాద్ (మార్చి – 03) : తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇటీవల విడుదల చేసిన టీఎస్ లాసెట్ (TS LAWCET – 2024) నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ అర్హతతో ఐదు సంవత్సరాల ‘ఇంటిగ్రేటెడ్ లా’ కోర్సును (integrated law with inter)చేయడానికి అవకాశం ఉంది.

టీఎస్ లా సెట్ ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐదేళ్ల లా కోర్సులో చేరే అవకాశం కలదు.