INTEGRATED BEd – ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ బీఈడీ

న్యూడిల్లీ (మార్చి – 07) : నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ (integrated Bed courses) కోర్సులను 2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది. మొదటగా ప్రయోగాత్మకంగా 57 ప్రముఖ జాతీయ, రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో దీన్ని ప్రారంభించనుంది.

ఇంటిగ్రేటెడ్ బీఈడీ లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ కోర్సులను నిర్వహిస్తారు. ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్నవారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుతో ఏడాది ముందే డిగ్రీ మరియు బీఈడీ పూర్తవుతుంది.

జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(NTA) నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాతీయ విద్యావిధానంలోని 5+3+3+4 స్థాయుల్లో బోధన స్థాయిల్లోని విద్యార్థుల బోధనకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణనిస్తారు.