నూతన సీడీఎస్ గా అనిల్ చౌహన్

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 28) : భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్ మరణం తర్వాత ఈ సైనిక అత్యున్నత పదవి అనిల్ చౌహన్ కి దక్కింది. దీంతో దేశ రెండో సీడీఎస్ గా అనిల్ చౌహాన్ని యమితులయ్యారు.

లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్ లో అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది.