PARA OLYMPICS : ఒక్క రోజే 8 పతకాలు సాదించిన భారత్

BIKKI NEWS (SEP. 03) : INDIA WON 8 MEDALS IN ONE DAY IN PARA OLYMPICS. పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత పారా క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో సత్తాచాటడంతో సోమవారం ఒక్కరోజే దేశానికి 8 పతకాలు దక్కాయి. వీటిలో 2 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

INDIA WON 8 MEDALS IN ONE DAY IN PARA OLYMPICS

ఒక్కరోజే 8 మెడల్స్‌తో రెండంకెల మార్కును దాటిన భారత్‌.. పతకాల పట్టికలో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచింది.

బ్యాడ్మింటన్‌లో నితేశ్‌ కుమార్‌ (ఎస్‌ఎల్‌3) స్వర్ణంతో మెరవగా సుహాస్‌ యతిరాజ్‌ (ఎస్‌ఎల్‌4), తులసిమథి మురుగేశన్‌ (ఎస్‌యూ5) రజతాలు పట్టుకొచ్చారు. మనీష రామదాస్‌ (ఎస్‌యూ5) కాంస్యం గెలిచింది.

అథ్లెటిక్స్‌ విషయానికొస్తే డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ (ఎఫ్‌64) మరోసారి ఈటను ప్రత్యర్థులకు అందనంత దూరం విసిరి పసిడిని నిలబెట్టుకోంది

డిస్కస్‌ త్రోలో కతునియా యోగేశ్‌ (ఎఫ్‌56), హైజంప్‌లో నిషాద్‌ కుమార్‌ (టీ47) సిల్వర్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు.

ఆర్చరీలో యువ సంచలనం శీతల్‌ దేవి, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ ద్వయం కాంస్యం నెగ్గింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు