INDvsENG : సెమీస్ కి చేరిన భారత్

లక్నో (అక్టోబర్ – 29) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ (INDvsENG) జట్ల మద్య జరిగిన లో స్కోర్ మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో సంచలన విజయం సాదించి సెమీస్ కి చేరిన తొలి జట్టు గా నిలిచింది.

230 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు )మొహమ్మద్ షమీ – 4, బుమ్రా – 3, కులదీప్ యాదవ్ – 2, జడేజా – 1 వికెట్లతో రాణించడంతో ఇంగ్లండ్ 129 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 229/9 పరుగులు సాదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (87), సూర్య కుమార్ యాదవ్ (49) మినహా ఎవరు పెద్దగా రాణించకపోయారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ఓపెనర్ గిల్ (9), కోహ్లీ డక్ ఔట్ కావడంతో నెమ్మదిగా ఆడిన రోహిత్, కెఎల్ రాహుల్ (39) ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే రోహిత్ ఔట్ అయ్యాక మళ్ళీ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే -3, రషీద్ ఖాన్ 2, వోక్స్ 2, మార్క్ ఉడ్ ఒక వికెట్ తీశారు.