BIKKI NEWS (JUNE 29) : ICC T20 WORLD CUP 2024 WON BY INDIA. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా భారత జట్టు నిలిచింది. ఇది భారత జట్టుకు రెండవ టి20 వరల్డ్ కప్, 2007లో జరిగిన మొదటి టి20 వరల్డ్ కప్ లోను భారత్ ధోని నేతృత్వంలో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా విశ్వవిజేతగా భారత్ నిలవడం విశేషం.
ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
ICC T20 WORLD CUP 2024 WON BY INDIA
ఈరోజు దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఒక దశలో గెలుపుపై ఆశలు కోల్పోయిన టీమ్ ఇండియాను పాస్ట్ బౌలర్లు బూమ్రా, హర్థిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ లు విజృంభించి బౌలింగ్ వేసి ఓటమి కోరల నుంచి భారత్ ను బయటపడేసి విశ్వ విజేతగా నిలిపారు. చివరి ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన మిల్లర్ క్యాచ్ భారత్ ను విశ్వవిజేతగా నిలిపిందనటంలో సందేహం లేదు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా సిరీస్ మొత్తం ఫామ్ లేక తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషించి 76 పరుగులతో రాణించగా, అక్షర్ పటేల్ 47, శివం దూబే 27 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 176/7 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జి రెండు, మహారాజ్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు క్లాసెన్ (52) వీరవిహారంతో గెలుపు ముంగిట వరకూ వచ్చింది. క్లాసెన్, డికాక్ (39) కలిపి భారత్ ను విజయానికి దూరంగా చేర్చినప్పటికీ, చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో భారత్ విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు, హర్షదీప్ సింగ్ 2, బుమ్రా -2 వికెట్లు తీశారు.
భారత్ మొట్టమొదటిసారి కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అనంతరం 2007లో మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన టి20 వరల్డ్ కప్పును గెలిచింది. అనంతరం మళ్లీ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోనే 2011లో వన్డే వరల్డ్ కప్ ను గెలిచింది మళ్లీ ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో టి20 వరల్డ్ కప్ ను గెలిచింది. దీంతో మొత్తం నాలుగు ఐసిసి టోర్నీలలో భారత్ విజయం సాధించినట్లుగా అయింది.