BIKKI NEWS (JUNE 22) : Hormuz strait is closed – iran parliament హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈమేరకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది.
Hormuz strait is closed – iran parliament
కువైట్ , ఖతర్, దుబాయ్, బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా ల నుండి ముడి చమురు తరలించే ప్రధాన మార్గం ఈ హర్మూజ్ జలసంధి.
ఇది ఆపేస్తే చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి, మధ్య ఆసియా లోని అరబ్ దేశాల ఎగుమతులు మరియు దిగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ ప్రభావం భారత దేశం మీద కూడా పడుతుంది, కానీ మన దిగుమతులు రష్యా నుండి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీవ్రత తక్కువగా ఉంటుంది.
హర్మూజ్ జలసంధి మూసివేతపై భారత్ స్పందించింది. మనం అక్కడ్నుంచి చమురు ను తక్కువగానే దిగుమతులు చేసుకుంటున్నామని, వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకున్నందువల్ల మన మీద ప్రభావం తక్కువగా ఉంటుందని పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీ ప్రకటించారు.
అలాగే మన దగ్గర కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం తక్కువగానే ఉన్నట్లు భావించవచ్చు.
ఇటీవలే భారీ చమురు నిక్షేపాలు కనుగొన్న సైప్రస్ దేశానికి గత వారం మన ప్రధాని సందర్శించారు. బహుశా అక్కడ నుండి చమురు దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఈ రెండు దేశాల నుండి వచ్చే చమురు యెమెన్ ఎర్ర సముద్రం మీదుగా రావాలి. యెమెన్ కూడా ఇప్పుడు ఇరాన్ కి మద్దతు తెలుపుతోంది, దీని ప్రభావం ఎర్ర సముద్రం మీద రవాణ అవుతున్న నౌకల మీద పడితే ప్రపంచలో వాణిజ్యం స్తంభిస్తుంది.
యెమెన్ చుట్టూ అమెరికా ఎయిర్ బేస్ లు ఉన్నాయి, ఎర్ర సముద్రం లో అమెరికా గస్తీ నౌకలు ఉన్నాయి. చూడాలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో చూడాలి.
- IND vs ENG – DAY 3 REPORT – కీలక ఆధిక్యతలో భారత్
- HORMUZ STRAIT CLOSED – హర్ముజ్ జలసంధి మూసివేత – పెరగునున్న క్రూడాయిల్ ధరలు
- UGC NET 2025 ADMIT CARDS కోసం క్లిక్ చేయండి
- CURRENT AFFAIRS JUNE 22nd 2025 – కరెంట్ అఫైర్స్
- Operation Midnight Hammer – ఇరాన్ అణు స్థావరాలు నేలమట్టం