TSPSC – GROUP 2 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ (TSPSC) కమిషన్ గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది(group 2 application edit option by tspsc). జూలై 8 నుండి 12వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు.

ఒక్కో అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం కలదు. కావున అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.

గ్రూప్ – 2 నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 29, 30వ తేదీలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/