GADDAR : ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

హైదరాబాద్ (ఆగస్టు – 06) : ప్రజా గాయకుడు‌, ప్రజా యుద్ధ నౌక గద్దర్ (Gaddar)అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. పీపల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు.

గద్దర్ 1949 లో తుప్రాన్ లో జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తేచ్చారు. ఎన్ కౌంటర్ లను తీవ్రంగా వ్యతిరేకించే వారు. 1987 కారంచేడు దళితుల హత్యల పై అవిశ్రాంతంగా పోరాడారు. 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగింది.

తెలంగాణ ఉద్యమం లో “అమ్మా తెలంగాణామా”, “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న'” వంటి పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ఓరేయ్ రిక్షా సినిమా లోని “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అనే పాటకు నంది బహుమతి వస్తే తిరస్కరించారు.