BIKKI NEWS (SEP. 01) : FAMILY RESCUE AT NAYAKAN GUDEM NEAR PALERU RESERVOIR. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పక్కన ఉన్న నాయకన్ గూడెం లోని హైవే పక్కన సిమెంట్ ఇటుకలు తయారు చేసే అమ్మే కుటుంబం వరదల్లో చిక్కుకుంది.
FAMILY RESCUE AT NAYAKAN GUDEM NEAR PALERU RESERVOIR
ఉదయం నుండి ఇంటిపైనే వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇల్లు సగం కూలిపోడంతో.. ఇంటి చుట్టూ వరద నీరు చేరడంతో… ఇంటిపైన కుటుంబ సభ్యుల ముగ్గురు చిక్కుకున్నారు. ఉదయం నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంతవరకు వారిని రక్షించలేకపోయారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ముగ్గురిని వెంటనే కాపాడాలని నాయకన్ గూడెం ప్రజలు వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
వరద ఉధృతంగా ఉండడంతో ఇప్పటికే సూర్యాపేట ఖమ్మం మధ్య రాకపోకలను ప్రభుత్వం నిషేధించింది దానితోపాటు వరద ఉధృతంగా ఉండడంతో హెలికాప్టర్ మినహా వేరే మార్గంలో వారిని కాపాడే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ను ఏర్పాటు చేసి వారిని కాపాడాలని బంధువులు స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు