IND vs PAK FINAL : ఎమర్జింగ్ ఆసియా కప్ విజేత పాకిస్థాన్

కొలంబో (జూలై – 23) : ACC EMERGING ASIA CUP 2023 FINAL మ్యాచ్ లో పాకిస్థాన్ A జట్టు భారత్ (Emerging asia cup 2023 winner pakistan) పై 128పరుగుల తేడాతో విజయం సాదించి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్ ను రెండోసారి నెగ్గి శ్రీలంక రికార్డు ను సమం చేసింది.

టాస్ గెలిచిన ఇండియా A జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ ఓపెనర్లు ఆయూబ్ (59), పర్హన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో గట్టి పునాది పడింది. అనంతరం తయ్యబ్ తాహీర్ 71 బంతుల్లోనే 108 పరుగులు చేసి భారీ స్కోరు కు బాటలు వేశాడు. పాకిస్థాన్ A జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 355 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో పరాగ్ – 2, హంగ్రేఖర్ – 2, రాణా, సుతార్, సింధు తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత యువ బ్యాట్స్‌మన్ ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. 224 పరుగులకే ఆలౌట్ కావడం జరిగింది. అభిషేక్ శర్మ – 61, యశ్ ధుల్ – 39, సాయిసుదర్శన్ – 29 మినహా ఎవరు రాణించలేదు. దీంతో భారత్ ఓటమి తప్పలేదు.

పాకిస్థాన్ బౌలర్లలో ముఖీమ్ – 3, ఇక్బాల్, ముంతాజ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిషాంత్ సింధు (ఇండియా), ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ గా తయ్యబ్ తాహీర్ నిలిచారు.