Home > JOBS > DSC (TRT) NOTIFICATION – నూతన రోస్టర్ విధానం

DSC (TRT) NOTIFICATION – నూతన రోస్టర్ విధానం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 25) : నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో తొలిసారి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు కొత్త జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు రూపొందించడంతో మహిళ అభ్యర్థులుకు స్కూల్ అసిస్టెంట్ కొలువుల్లో 60% సీట్లు దక్కుతున్నాయి. Dsc notification 2023 new roaster system

తాజా డీఎస్సీ నోటిఫికేషన్ లో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల్లో 51 శాతానికిపైగా మహిళలకు దక్కనున్నాయి. తాజా డీఎస్సీ లోనే కాదు భవిష్యత్తులో వచ్చే రెండు డీఎస్సీ లోనూ మహిళలకే అగ్రభాగం స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సొంతం కానున్నాయి.

రోస్టర్ అంటే ఒకటో పాయింట్ తో మొదలై 100వ పాయింట్ తో ముగిస్తుంది. 100 పోస్టులను ఒక సైకిల్ గా పిలుస్తారు. తొలి ఉద్యోగం ఓసీ మహిళతో ప్రారంభమై వందో పోస్టు ఈబ్ల్యూఎస్ తో ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఓసీ మహిళతో ప్రారంభిస్తారు.

మొత్తం 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం దక్కుతాయి. కాకపోతే 10 ఉద్యోగాల్లో ఆరు మహిళలకే కేటాయించారు. సామాజికవర్గాలు వేర్వేరు కావొచ్చు. గానీ.. 6 ఉద్యోగాలు మాత్రం వారికే దక్కుతాయన్నది స్పష్టం.

అదేవిధంగా మొదటి 25 పోస్టుల్లో 12 వారికి రిజర్వు అయ్యాయి. మిగిలిన 75 ఉద్యోగాల్లో 21 మహిళలకు ఇస్తారు.