హైదరాబాద్ (నవంబర్ – 14) : ISRO సంస్థ వచ్చే నెల రోజులలో రెండు పెద్ద రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ISRO PSLV EXO SAT and GSLV MK2 Missions ప్రయోగాలను చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ – ఎంకే2 ప్రయోగాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
పీఎస్ఎల్వీ ఎక్స్పో శాట్ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్ మూలాలకు సంబంధించిన వివిధ డైనమిక్ లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి మిషన్.
జీఎస్ఎల్వీ ద్వారా ఇన్ శాట్- 3 డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది వాతావరణ సేవలను అందించనుంది. జీఎస్ఎల్వీ-ఎంకే2 ప్రయోగం చాలా ముఖ్యమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీతో కలిసి దీనిని అభివృద్ధి చేయనున్నారు.