Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU MARCH 23rd

DAILY GK BITS IN TELUGU MARCH 23rd

DAILY G.K. BITS IN TELUGU MARCH 23rd

1) మానవులలో సాధారణంగా కనిపించే అణుధార్మిక మూలకం ఏది?
జ : పొటాషియం – 40

2) లోయర్ మానేరు డ్యాం ఏ జిల్లాలో ఉంది.?
జ : కరీంనగర్

3) ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు.?.
జ : నేతాజీ సుభాష్ చంద్రబోస్

4) వినోబా భావే తెలంగాణలో ప్రారంభించిన భూదాన ఉద్యమానికి మొదటిసారిగా భూమిని దానం చేసింది ఎవరు.?
జ : వెదిరె రామచంద్రారెడ్డి

5) తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామం ఏది.?
జ : బాసర

6) డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది.?
జ : 1982

7) హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు.?
జ : కొమర్రాజు లక్ష్మణరావు

8) నీలగిరి కొండల దక్షిణం వైపు గల పాస్ పేరు ఏమిటి?
జ : పాల్ ఘాట్

9) 1885 లో బొంబాయి లో జరిగిన మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు .?
జ : డబ్ల్యూ సి బెనర్జీ

10) మానవ శరీరంలోని ప్రధాన రక్త సమూహాలను మొదటిసారిగా వేరు పరచిన శాస్త్రవేత్త ఎవరు?
జ : కార్ల్ ల్యాండ్ స్టీనర్

11) గిర్ గ్లాని కమిషన్ నియామక ఉద్దేశం ఏమిటి.?
జ : జీవో నెంబర్ 610 అమలుతీరు పరిశీలించుటకు

12) కొమురం భీం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది.?
జ : పెద్ద వాగు

13) ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ సవరించరాదనే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఏ తీర్పులో ప్రకటించింది .?
జ : గోలక్ నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్

14) ధనుష్కోడి అనేది వేటిని కలిపే కేంద్రము.?
జ : బంగాళాఖాతం & హిందూ మహాసముద్రం

15) భారత రాజ్యాంగంలో ‘హెబియస్ కార్పస్’ అని రిట్ ను జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు.?
జ : సుప్రీంకోర్టు మరియు హైకోర్టు