DAILY GK BITS IN TELUGU 1st JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 1st JULY

DAILY GK BITS IN TELUGU 1st JULY

1) ఆవర్తన పట్టికను 1869లో ఎవరు అభివృద్ధి చేశారు.?
జ : డిమిత్రి మెండలీవ్

2) అతి చిన్న పరమాణువు ఏది.?
జ : హైడ్రోజన్ (H),

3) అతిపెద్ద పరమాణువు ఏది.?
జ : సీసియం (Cs)

4) విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఏది.?
జ : హైడ్రోజన్ (H)

5) భూమి యొక్క క్రస్ట్‌లో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఏది.?
జ : ఆక్సిజన్ (O)

6) ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్యను దేనితో నిర్ణయిస్తారు.?
జ : కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యతో

7) ఒక మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశిని ఎలా నిర్ణయిస్తారు.?
జ : పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యతో

8) pH స్కేల్‌ను 1909లోఎవరు
అభివృద్ధి చేశారు.?
జ : సోరెన్ సోరెన్‌సెన్

9) ఏ బ్యాక్టీరియాను సల్ఫర్ బ్యాక్టీరియా అంటారు.?
జ : థయోబాసిల్లస్

10) దండాకారంలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు.?
జ : బాసిల్లై

11) బ్యాక్టీరియా కనద్రావంలో ఉండే డీఎన్ఏ ముక్కలను ఏమంటారు.?
జ : ప్లాస్మిడ్స్

12) మొక్కలలో దారు కణజాలం ఉపయోగం ఏమిటి?
జ : నీటి ప్రసరణ

13) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కలలో భాష్పోత్సేకం ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది

14) చనిపోయిన తర్వాత మానవ కండరాలు గట్టిపడటాన్ని ఏమంటారు.?
జ : రిగర్ మార్టిస్

15) ఈ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకాన్ని నిరోధిస్తుంది.?
జ : అబ్‌సెసిక్ ఆమ్లం

16) కణంలోని ఏ కణంగాన్ని ఆహార పదార్థాల కర్మాగారం అంటారు.?
జ : హరితరేణువు

17) కిరణ జన్య సంయోగ క్రియలో ఒక అణువు గ్లూకోజ్ ఏర్పడటానికి ఎన్ని అణువుల కార్బన్ డైఆక్సైడ్ కావాలి.?
జ : 6

18) ఏ రకమైన మొక్కలలో శ్వాసించే వేర్లు ఉంటాయి.?
జ : మాంగ్రూవ్ మొక్కలు

19) మద్రాసు పట్టణాన్ని ఇంగ్లాండు వారికి ఇచ్చినది ఎవరు.?
జ : చంద్రగిరి రాజు

20) సెయింట్ జార్జి కోట నిర్మాణం ఎప్పుడు పూర్తి అయింది.?
జ : 1641

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు