BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 4th JULY
DAILY GK BITS IN TELUGU 4th JULY
1) “యాంకిల్ హోల్డ్” అనే పదం ఏ క్రీడకు సంబంధించినది.?
జ : కబడ్డీ
2) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో
3) “రన్నింగ్ హ్యాండ్ టచ్” అనే పదం ఏ క్రీడకు సంబంధించినది.?
జ : కబడ్డీ
4) మొదటి ఏ వీడియో గేమ్, 1971లో నోలన్ బుష్నెల్ మరియు టెడ్ డాబ్నీ ప్రారంభించారు.?
జ : “కంప్యూటర్ స్పేస్”
5) ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం ఏది.?
జ : గ్రీన్‌ల్యాండ్ (దాదాపు 2.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది)
6) ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, సుందర్బన్స్ ఎక్కడ ఉంది.?
జ : బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో ఉంది
7) ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం, నీటి పరిమాణం ప్రకారం, ఏది.?
జ : కాంగో నదిపై ఉన్న ఇంగా జలపాతం.
8) ప్రపంచంలోని అతిపెద్ద గల్ఫ్ ఏది.?
జ : గల్ఫ్ ఆఫ్ మెక్సికో (దాదాపు 615,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.)
9) కాకతీయుల కాలంనాటి పేరీణీ నృత్యాన్ని పునరుద్ధరించింది ఎవరు.?
జ : నటరాజ రామకృష్ణ
10) రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలోని ఏ సూత్రం గాంధేయ సూత్రంగా పరిగణించబడుతుంది.?
జ : గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం
11) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది.?
జ : పదవ షెడ్యూల్
12) ఏ ఆర్టికల్ ప్రకారం సివిల్ సర్వెంట్స్ కు రక్షణ కల్పించబడింది.?
జ : ఆర్టికల్ 311
13) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ డివైజ్ పార్కును ఎక్కడ స్థాపించింది.?
జ : సుల్తాన్ పూర్
14) ‘ఖండకాద్యక’, బ్రహ్మస్పుట సిద్దాంతం ఎవరి రచనలు ?
జ : బ్రహ్మగుఫ్తుడు
15) శాతవాహనుల కాలంలో బట్టలు తయారు చేయు వారిని ఏమని పిలుస్తారు.?
జ : పేసకారులు
16) శాతవాహనుల కాలంలో ఇత్తడి కార్మికులను ఏమని పిలుస్తారు.?
జ : కాసకారులు
17) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నంద్యాల అడవి ప్రాంతంలో కనిపించే బన్మనస్ అనే పదం దేనిని సూచిస్తుంది.?
జ : అటవీ తెగ వారు
18) పరిపాలన మరియు యుద్ధాలలో చురుకుగా పాల్గొన్న చాళుక్య యువరాణి ఎవరు.?
జ : అక్కదేవి
19) బృహత్కథ అనే గ్రంధాన్ని గుణాడ్యుడు ఏ భాషలో రచించాడు.?
జ : పైశాచి
20) ప్రపంచ జనాభా 8 బిలియన్లకు(800 కోట్లు) చేరిన రోజు ఏది.?
జ : 15 నవంబర్ 2022