Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 6th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 6th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 6th

1) 51 వరకు భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏది.?
జ: కోల్ కతా

2) జాతీయ అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటించవచ్చు.?
జ : 352

3) భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఎలా వర్ణించింది.?
జ : రాష్ట్రాల యూనియన్ గా

4) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.?
జ : 44వ సవరణ చట్టం ద్వారా

5) ఇతర వెనుకబడిన తరగతులు(OBC) జాబితాను సొంతంగా సిద్ధం చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టిపెట్టినందుకు ఉద్దేశించిన సవరణ చట్టం ఏది?
జ : 105 వ రాజ్యాంగ సవరణ చట్టం

6) హనుమాన్ చాలీసా, రామ చరిత మానస్ ను రచించిన కవి ఎవరు.?
జ : తులసీదాస్

7) 1556 లో రెండవ పానిపట్టి యుద్ధంలో హేమూ ను ఓడించింది ఎవరు?
జ : అక్బర్

8) మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ (మరాఠీ) వంటి పత్రికలను ప్రారంభించినది ఎవరు.?
జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

9) భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు.?
జ: అనిబీసెంట్

10) హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు.?
జ : అనిబీసెంట్

11) బ్రిటిష్ ఇండియాకు చివరి వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ మౌంట్ బాటన్

12) భూదానోద్యమం ఎవరు ప్రారంభించారు.?
జ : వినోబా భావే

13) రెడ్ క్రాస్ సొసైటీని ఎవరు స్థాపించారు.?
జ : హెన్రీ డ్యూ నాంట్

14) శిలాజాల వయసును తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతి ఏది?
జ : కార్బన్ డేటింగ్ ( C – 14)

15) సూర్యుడిలో జరిగే కేంద్రక చర్యలు ఏ రకమైనవి.?
జ : కేంద్రక సంలీన చర్యలు

16) మానవుని దంత సూత్రము ఏమిటి.?
జ : 2123/2123

17) బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు.?
జ : ఆంటోనీ వన్ లీవెన్ హుక్

18) మొక్కలు భూమి నుండి సేకరించిన నీటిలో ఎంత శాతాన్ని కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించుకుంటాయి.?
జ : కేవలం రెండు శాతం

19) ఆపిల్ లో తినడానికి ఉపయోగపడే భాగం ఏమిటి.?
జ : పుష్పాసనం

20) 1945 ఆగస్టు 6న హీరోషిమాపై అమెరికా వేసిన ఆనుబాంబు పేరు ఏమిటి.?
జ : లిటిల్ బాయ్

21) 1945 ఆగస్టు 9న నాగసాకి పై అమెరికా చేసిన అణుబాంబు పేరు ఏమిటి?
జ : ఫ్యాట్ మాన్

22) సహజ విపత్తులు కేంద్రంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి.?
జ : కేంద్ర హోమ్ శాఖ