Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 21st

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 21st

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 21st

1) మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఎక్కడ రూపొందుతుంది.?
జ : రెటీనా

2) ‘ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్’ అనేది అమెరికా ఏ దేశంలో చేపట్టిన చర్య.?
జ : ఇరాక్

3) 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన తర్వాత 1916లో గాంధీ ఉపన్యసించిన మొదటి బహిరంగ సభ ఏది.?
జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభ వేడుకలల

4) 1997లో జై తెలంగాణ పార్టీ స్థాపించినది ఎవరు.?
జ : పి.ఇంద్రారెడ్డి

5) నకిలీ కరెన్సీ నోట్లు, పాస్‌పోర్ట్ లను నివారించేందుకు ఏ సంస్థ ప్రత్యేక సిరాను రూపొందించారు.?
జ :నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ (NPL)

6) ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి.?
జ : మా తెలంగాణ

7) తెలంగాణ లో బొగ్గు వనరులు భారత్ లో ఎంత శాతం వరకు ఉంటాయి.?
జ : 20% వరకు

8) తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటి అమరుడు ఎవరు.?
జ : దొడ్డి కొమరయ్య

9) భారత్ బంగ్లాదేశీయులకు ‘తీన్ భీమా’ అనే ప్రాంతంలోకి 24 గంటల ప్రవేశం కల్పించింది. ఇది ఎక్కడ ఉంది.?
జ : కూచ్ బీహార్ జిల్లా (పశ్చిమ బెంగాల్)

10) భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది.?
జ : రైల్వేలు

11) వేములవాడ చాళుక్యుల కాలంలో అత్యంత వైభవాన్ని చూసిన మతం ఏది.?
జ : జైనమతం

12) పాదరస బారోమీటర్ ను ఆవిష్కరించింది ఎవరు.?
జ : టారిసెల్లి

13) సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : నికోలస్ కోపర్నికస్

14) ప్రాణహిత- గోదావరి లోయలో కలిగిన సహజ వనరులు ఏవి.?
జ : బొగ్గు

15) తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లింక్ ఏరియా ఎంత.?
జ : 560 చదరపు ఫీట్లు

16) భారతదేశ బంగ్లాదేశ్ తో అతి పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది. రెండవ అతి పొడవైన భూ సరిహద్దు ఏ దేశంతో కలిగి ఉంది.?
జ : చైనా

17) ‘టీ – ప్రైడ్’ పథకం ఉద్దేశం ఏమిటి.?
జ : ఎస్సీ, ఎస్టీ లలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం

18) శాతవాహనుల మెరుగైన పరిపాలన నిమిత్తం వారి రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించారు. వాటి పేరు ఏమిటి.?
జ : ఆహరాలు

19) భారత రాజ్యాంగం ప్రకారం ‘రాజ్యం తన సొంత మతాన్ని స్థాపించదు లేదా ప్రత్యేక మతంకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు.’ దీని అర్థం ఏమిటి.?
జ : లౌకికవాదం

20) ‘స్వతంత్ర హైదరాబాద్ అనే భావన భారతదేశ గుండెకాయలో పుండు వంటిది. దానిని శాస్త్ర చికిత్స ద్వారా తీసివేయడం అవసరం.’ అని ఎవరు అభిప్రాయపడ్డారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్