DAILY G.K. BITS IN TELUGU 16th FEBRUARY
1) నేషనల్ పాలసీ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను కేంద్రం ఎప్పుడు ప్రవేశపెట్టింది.?
జ : 2005
2) గ్రామీణ ప్రాంతాలలో సామూహిక సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : పరంపరాగత్ కృషి వికాస్ యోజన
3) కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్ లో ప్రారంభించిన కార్యక్రమం పీఏం ప్రనామ్ లక్ష్యం ఏమిటి.?
జ : కోటి మంది రైతులను సేంద్రియ సాగువైపు మళ్లించడం
4) ఓజోన్ పొర మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు.?
జ : డాబ్సన్ యూనిట్స్
5) ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం ఏమిటి.?
జ : క్లోరో ప్లోరో కార్బన్లు
6) కిగాలి ఒప్పందం దేనికి సంబంధించినది.?
జ : ఓజోన్ పొర పరిరక్షణ
7) కిగాలి ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు బదులు వేటి వినియోగాన్ని తగ్గించాలి.?
జ : హైడ్రోప్లోరో కార్బన్స్
8) నాన్ స్టిక్ వంట పాత్రల తయారిలో ఉపయోగించే పాలిథిన్ ఏది.?
జ : టెప్లాన్
9) శస్త్ర చికిత్సలో కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది.?
జ : పాలి లాక్టిక్ యాసిడ్
10) సహజ రబ్బర్ ను దేని నుండి తయారు చేస్తారు.?
జ : లేటెక్స్
11) రబ్బర్ వల్కనైజేషన్ కు ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సల్ఫర్
12) రబ్బర్ వల్కనైజేషన్ ను కనిపెట్టినది ఎవరు.?
జ : చార్లెస్ గుడ్ ఇయర్
13) మినీ జపాన్ అని దేనికి పేరు.?
జ : శివకాశీ
14) సిటీ ఆఫ్ రోజేస్ అని ఏ నగరానికి పేరు.?
జ : చండీగఢ్
15) స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఏ రాష్ట్రానికి పేరు.?
జ : మేఘాలయ
16) మినీ టిబెట్ అని ఏ ప్రాంతానికి పేరు.?
జ : లడాఖ్
17) ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని ఏ నగరానికి పేరు.?
జ : మణిపూర్
18) అండమాన్ నికోబార్ దీవులలో అతి చిన్న దీవి ఏది.?
జ : రాస్ దీవి
19) ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ర్యాలీస్ అని పిలుస్తారు.?
జ : న్యూడిల్లీ
20) భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది.?
జ : 1972 జూలై 02