DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th MAY 2023

1) భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సాత్విక్ – చిరాగ్ శెట్టి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నారు. ఎన్నో ర్యాంక్.?
జ : 4వ ర్యాంక్

2) పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 31

3) 57వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు.?
జ : దామోదర్ మౌజో (కొంకణి)

4) బర్నింగ్ హోమ్ నగరానికి లార్డ్ మేయర్ గా ఎన్నికైన మొదటి ప్రవాస భారతీయుడుగా ఎవరు నిలిచారు.?
జ : ఛమన్ లాల్

5) భారతదేశం ఏ దేశానికి 2024 మార్చి వరకు ఒక బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఆమోదించింది.?
జ : శ్రీలంక

6) నైజీరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : బోలా అహ్మద్ తినుబు

7) నేపాల్ లో భారతదేశం ప్రారంభించిన రెండవ హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరు ఏమిటి?
జ : అరుణ్ – III

8) ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం ఏ సంస్థతో 141.2 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్

9) ఏ దేశానికి చెందిన 300 మంది విద్యార్థులకు మహాత్మా గాంధీ స్కాలర్ షిప్ లను భారత ప్రభుత్వం అందించనుంది.?
జ : శ్రీలంక

10) స్క్వార్ట్ ప్రపంచ కప్ 2023 కు భారత్ లోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : చెన్నై

11) ఇటీవల అమెరికా – బంగ్లాదేశ్ నావిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల పేరు ఏమిటి?
జ : ది టైగర్ షార్క్ 40

12) ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ – ఆసియా విభాగానికి అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : గోవిందరాజు

13) చైనా మొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక పౌర వ్యోమోగామిని పంపింది. ఆయన పేరు.?
జ : గుయి హయిచావో

14) ది పోసన్ ఫెస్టివల్ శ్రీలంక ప్రతి ఏటా జూన్ లో జరుపుకుంటుంది. ఏ సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటుంది.?
జ : శ్రీలంకలో బుద్ధిజాన్ని అశోకుని కొడుకు అర్హత్ మహిందా ప్రవేశపెట్టిన సందర్భంగా