DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th MAY 2023

1) కోన్ని ఆల్కహాల్ పానీయాలను ఆరోగ్య పానీయంగా గుర్తించి అమ్మడానికి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : ఐర్లాండ్

2) మొట్టమొదటి అర్బన్ క్లైమేట్ ఫిలిం ఫెస్టివల్ 2023ను ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : కలకత్తా

3) గోల్డ్ మాన్ సాక్స్ సంస్థ ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు 2023 లో ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.3%

4) ఆర్బిఐ ప్రకారం 2023 – 24 ఎంతగా ఉండనుంది.?
జ : 1st : 7.8%, 2nd : 6.2%, 3rd : 6.1%, 4th : 5.9%

5) యునాని మందులను అభివృద్ధి చేయడానికి కేంద్ర మైనారిటీ శాఖ ఏ పథకం కింద కార్యక్రమాన్ని చేపట్టింది.?
జ : ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK)

6) మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనాన్స్ జరిగిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : హెచ్ ఎస్. ప్రణయ్

7) ఏ నివేదిక ద్వారా ఉత్తర కొరియాలో రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు విధించినట్లు వెల్లడైంది.?
జ : అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక – 2022

8) స్మార్ట్ ఫోన్లకు ఏ మాల్ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.?
జ : దామ్ వైరస్

9) చిన్న మొత్తాల పొదుపులో ఎంత పొదుపు దాటితే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని పోస్టల్ శాఖ నిర్ణయం తీసుకుంది.?
జ : 10 లక్షలు

10) నీతి అయోగ్ నివేదిక ప్రకారం “బహుముఖ పేదరికం” అధికంగా, మరియు అల్పంగా ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : బీహార్ కేరళ

11) నీతి అయోగ్ నివేదిక ప్రకారం “బహుముఖ పేదరికం” ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఎంత శాతంగా ఉంది.?
జ : AP – 12.3%, TS – 13.7%

12) లోగో మ్యాన్ ఆఫ్ తెలంగాణ గా ప్రసిద్ధి చెందినది ఎవరు.? ఇటీవల ఇతను తెలంగాణ 10 సంవత్సరాల ఆవిర్భావ లోగోని కూడా రూపొందించారు.?
జ : చేర్యాల రవిశంకర్

13) ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 16

14) ఎర్న్ వైల్ లెర్న్ (చదువుతూ సంపాదన) అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది.?
జ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్

15) ఏ దేశం పార్లమెంట్ ఇటీవల దీపావళికి సెలవు దినంగా ప్రకటిస్తూ బిల్లు పాస్ చేసింది.?
జ : అమెరికా

16) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి తమిళ మహిళగా ఎవరు నిలిచారు.?
జ : ముత్తమిళ్ సెల్వి

17) మే 29న జిఎస్ఎల్వి – ఎఫ్2 ఉపయోగాన్ని ఇస్రో ఎక్కడి నుంచి ప్రయోగించనుంది.?
జ :షార్ కేంద్రం (తిరుపతి)

18) ఐపీఎల్ 2023 విజేతకు మరియు రన్నర్ కు ఎంత ప్రైజ్ మనీని బిసిసిఐ ప్రకటించింది.?
జ : 20 కోట్లు, 13 కోట్లు

19) భారత్ సైన్యం కోసం ఆకాష్ వెపన్ సిస్టం తయారీ, సరఫరా కోసం ఏ సంస్థ కేంద్రంతో 8161 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

20) సోలార్ పార్కుల స్థాపన సామర్థ్యం అత్యధికంగా కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : ఆంధ్ర ప్రదేశ్