DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th AUGUST 2023

1) బ్రిక్స్ కూటమి లో నూతనంగా ఎన్ని దేశాలు చేరనున్నాయి.?
జ : ఆరు

2) పీడే చెస్ ప్రపంచ కప్ 2023 విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : మాగ్నస్ కార్లసన్ (ప్రజ్ఞానందా పై)

3) పీడే చెస్ ప్రపంచ కప్ 2023 విన్నర్, రన్నర్ లకు దక్కిన ప్రైజ్నీ ఎంత.?
జ : మాగ్నస్ కార్లసన్ – 90.93 లక్షలు.
ప్రజ్ఞానందా – 66.13 లక్షలు

4) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 పోల్వాల్టిలో స్వర్ణ పథకాలు గెలిచిన క్రీడాకారిణులు ఎవరు.?
జ : నీనా కెనడీ – కేథీ మూన్

5) భారత్ కంటే ముందు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతంగా చేసిన దేశాలు ఏవి.?
జ : అమెరికా, సోవియట్ యూనియన్, చైనా.

6) ఇటీవల తేజస్ యుద్ధ విమానం నుండి 20వేల అడుగుల ఎత్తులో గగనతలం నుంచి గగనతలంలో లకి ప్రయోగించిన క్షిపణి పేరు ఏమిటి.?
జ : అస్త్ర క్షిపణి

7) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.?
జ : 2027

8) వాయు కాలుష్యం కారణంగా యాంటీబయోటిక్స్ పనితీరు తగ్గిపోతుందని ఏ సంస్థ నివేదిక తెలిపింది.?
జ : లాన్సెట్

9) సునామీ కారణంగా దెబ్బతిన్న ఏ అణు విద్యుత్ కేంద్రం నుండి వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి జపాన్ దేశం విడుదల చేయనుంది.?
జ : పుకుషిమా

10) యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ ఏ దేశపు రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం విధించింది.?
జ : భారత్ రెజ్లింగ్ సమాఖ్య

11) చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి ఏ రకానికి చెందినది.?
జ : అనర్తోసైట్ మృత్తిక

12) అనర్తోసైట్ మృత్తిక భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో విరివిగా ఉంది.?
జ : నమ్మక్కల్

13) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) నూతన తాత్కాలిగా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీలకంఠ్ మిశ్రా

14) 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?
జ : రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్

15) 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ – 2023 లో జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటిమణులుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అల్లు అర్జున్ & అలియాభట్ – కృతి సనన్

16) 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఏ చిత్రం నిలిచింది.?
జ : ఉప్పెన

17) ఆదిత్య L1 ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు.?
జ : సెప్టెంబర్ 2023