BRICS – కూటమిలోకి మరో 6 దేశాలు

హైదరాబాద్ (ఆగస్టు – 25) : BRICS కూటమిలోకి కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. 2024 జనవరి 1 నుంచి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ లో చేరతాయి.

దీంతో కూటమిలో సభ్య దేశాల సంఖ్య 11 కు చేరనుంది. 2009 లో 4 దేశాలతో (BRIC) గాఏర్పడి 2010 లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICS గా మారింది. మళ్లీ ఇప్పుడు నూతనంగా 6 దేశాలను కూటమిలోకి ఆహ్వానించిం.

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్ లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సు విస్తరణపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భారత ప్రధానిళమోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్గా హాజరయ్యారు. ‘బ్రిక్స్ విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలు, ప్రమాణాలు, విధానాలపై చర్చించాం. తొలిదశ విస్తరణకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆరు దేశాలను పూర్తి స్థాయి సభ్యులుగా బ్రిక్స్ లోకి ఆహ్వానిస్తున్నాం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసావెల్లడించారు.

BRICS COUNTRIES LIST

  1. బ్రెజిల్
  2. రష్యా
  3. ఇండియా
  4. చైనా
  5. సౌతాఫ్రికా
  6. అర్జెంటీనా
  7. ఈజిప్టు
  8. ఇథియోపియా
  9. ఇరాన్
  10. సౌదీఅరేబియా
  11. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

Comments are closed.