DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th MAY 2023

1) సృష్టిలో అది తక్కువగా నిద్రించే జీవిగా ఏ జీవిని ఇటీవల గుర్తించారు.?
జ : ఎలిఫెంట్ సీల్

2) 72 వేల కోట్ల అభివృద్ధి పనులను ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : అండమాన్ నికోబార్ దీవులు

3) ఐరాస తాజా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంతగా ఉంది.?
జ : లక్షకు 19

4) UPSC చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : మనోజ్ సోనీ

5) కేంద్ర జలశక్తి శాఖ నివేదిక ప్రకారం ఎన్ని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు 100% కొళాయి నీటిని గ్రామీణ ప్రాంతాలకు అందిస్తున్నాయి ?
జ : 8 (తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హర్యానా, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్, దాద్రా నగర్ హవెళీ – డామన్ డయ్యూ)

6) కేంద్ర జలశక్తి శాఖ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలకు కుళాయి నీటిని అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 18

7) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.? ఈ పదవిలో స్వీకరించిన తొలి మహిళ ఈమె.
జ : రవ్‌నీత్ కౌర్

8) ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా మట్టి నాణ్యతను పరీక్షించేందుకు ఎరీస్ ఆగ్రో సంస్థ ఆవిష్కరించిన పరికరం పేరు ఏమిటి?
జ : భూ పరీక్షక్

9) పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ లేదా ట్రాక్ చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన పోర్టల్ పేరు ఏమిటి?
జ : సంచార్ సాథీ పోర్టల్

10) ఓకే క్యాలెండర్ ఇయర్ లో టెస్ట్, వన్డే, t20 అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లో కూడా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : శుభమన్ గిల్

11) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం ఏ దేశపు ద్రవ్యోల్బణం 100 శాతానికి చేరింది.?
జ : అర్జెంటీనా

12) భారత స్టార్ షట్లర్ ప్రణయ్ తాజా ర్యాంకింగ్ లో తన కెరీర్ లో ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు.? అది ఎన్నో స్థానం.?
జ : ఏడవ స్థానం

13) వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సు 2023 కు తెలంగాణ తరఫున ఎవరు హాజరవుతున్నారు.?
జ : మంత్రి కేటీఆర్