DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th MAY 2023

1) ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది.? జ : మూడు కాంస్యాలు (హుషాముద్దీన్, నిశాంత్ దేవ్, దీపక్)

2) ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్ లో 2023లో రజతాలు నెగ్గిన భారత షూటర్లు ఎవరు.? జ : హృదయ్ హజరికా‌, నాన్సీ

3) 2023 ఏప్రిల్ మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది .? జ : 4.7%

4) 2023 మార్చి మాసానికి దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంతగా నమోదయింది.? జ : 1.1%

5) 2022వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన లాకప్ డెత్ ల సంఖ్య ఎంత .? జ : 175

6) మూడేళ్ల నుంచి విశ్వంలో కాంతిని విరజిమ్ముతున్న అతిపెద్ద విస్ఫోటనాన్ని నాసా ఇటీవల కనిపెట్టింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : AT2021 – LWX

7) అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్య ఏ సర్వ్ పై తాత్కాలికంగా నిషేధం విధించింది.?
జ : స్పిన్ సర్వ్

8) ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీని ఈ సంవత్సరం నుండి ఎంతకు పెంచారు.?
జ : 448 కోట్లు (సింగిల్స్ విజేతకు 20 కోట్లు)

9) ఏ సమయంలోనైనా కోర్టులో కేసును నమోదు చేయడానికి సుప్రీంకోర్టు ప్రారంభించిన ఆన్లైన్ పద్ధతి పేరు ఏమిటి?
జ : ఈ ఫైలింగ్ 2.0

10) హైదరాబాదులో టెక్నాలజీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది?
జ : లండన్ స్టాక్ ఎక్స్చేంజ్

11) మహి బన్సవారా అటామిక్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది.?
జ : రాజస్థాన్

12) ఐపీఎల్ 2023లో సెంచరీ చేసిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : సూర్యకుమార్ యాదవ్

13) మే – 2023 టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటో గా ఏ బాలీవుడ్ నటి నిలిచారు.?
జ : దీపికా పదుకోనే

14) ఇటీవల యూజర్ల పాస్వర్డ్ ను మరియు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లను చోరీ చేస్తున్న మాల్వేర్ పేరు ఏమిటి.?
జ : ప్లూ హర్స్

15) ఏ వ్యాధి పై అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన విడుదల చేసింది.?
జ : మంకీ ఫాక్స్