DAILY CURRENT AFFAIRS 17th JANUARY 2023

1) సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్ఠు అనే సంప్రదాయ ఆటను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : తమిళనాడు

2) భారతదేశంలో వాతావరణాన్ని కచ్చితత్వంలో అంచనా వేయడానికి ఏర్పాటు చేయనున్న వ్యవస్థ పేరు ఏమిటి.?
జ : డాప్లర్ వెదర్ రాడార్ నెట్వర్క్

3) క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 లో RRR దక్కించుకున్న అవార్డులు ఏవి.?
జ : ఉత్తమ విదేశీ భాష చిత్రం, నాటు నాటు పాట

4) ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం భారత్ లో చివరి 50% ప్రజల దగ్గర ఉన్న సంపద ఎంత.?
జ : 3%

5) ఎకానమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) చీఫ్ ఎకానామిస్ట్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : క్లారె లొంబార్డెల్లి

6) G20 సమావేశాలలో భాగంగా THINK20 సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : భోపాల్

7) జాతీయ భద్రతా ఉప సలహాదారుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : పంకజ్ కుమార్ సింగ్

8) ఐరాస ఇటీవల ఎవరిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.?
జ : అబ్దుల్ రెహమాన్ మక్కీ (లష్కర్ ఈ తోయిబా)

9) 2022 లో చైనా జీడీపీ ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 3%

10) తెలంగాణ లో లిథియం బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్న సంస్థ ఏది.?
జ : అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్

11) తెలంగాణలో అతిపెద్ద మెగా విజయ డెయిరీ ని ఎక్కడ ప్రారంభించనున్నారు.?
జ : రంగారెడ్డి జిల్లా రావిర్యాల

12) డయాబెటిస్ వ్యాధి కొరకు కృత్రిమ పాంక్రియాస్ ను అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఏది.?
జ : కేంబ్రిడ్జి యూనివర్సిటీ

13) మార్టిన్ లూథర్ కింగ్ గ్రాండే పరేడ్ స్పేషల్ అవార్డు 2022 దక్కించుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : కృష్ణ వావిలాల