DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2022

1) కేంద్ర కేబినెట్ నిరుపేదలకు ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగిచడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : డిసెంబర్ – 31- 2022

2) కేంద్ర కేబినెట్ 10 వేల కోట్లతో మూడు రైల్వే స్టేషన్ లను ఆధునికీకరణకు అమోదం తెలిపింది. ఆ స్టేషన్ లు ఏవి.?
జ : న్యూడిల్లీ, ఆహ్మదాబాద్, ముంబై చత్రపతి రైల్వే స్టేషన్ లు

3) భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనిల్ చౌహన్

4) తెలంగాణ లో ఏ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక “జల్ జీవన్ మిషన్” అవార్డు కు ఎంపికైంది.?
జ : మిషన్ భగీరథ

5) ఇటలీ మొదటి మహిళ ప్రధాని గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జార్జియా మెలోని (బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ)

6) రష్యా తాజాగా ఏ అమెరికన్ మాజీ కాంట్రాక్టర్ కు పౌరసత్వం ఇచ్చింది.?
జ : ఎడ్వర్డ్ స్నోడెన్

7) పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ అధికారులకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సభ్యులకు సెక్షన్ 194(2) కింద ఉన్న మినహాయింపులపై తాజాగా ఎవరి ఆధ్వర్యంలో ధర్మాసనం ఏర్పాటు అయింది.?
జ : జస్టీస్ ఎస్. ఎ. నజీర్

8) తెలంగాణ హైకోర్టు విచారణలను ఎప్పటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.?
జ : అక్టోబర్ – 10 – 2022

9)ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిట్ సెంటర్ (ICMF) ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు

10) గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్ లో ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పేరు ఏమిటి.?
జ : డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ (DAP)

11) నిజామాబాద్ నుండి నిర్మల్ కు 70 కీమీ దూరం డ్రోన్ సహాయం తో 30 నిమిషాలలో మందులను సరఫరా చేసిన స్టార్టప్ కంపెనీ పేరు ఏమిటి.?
జ : టీశా – మెడికార్ట్

12) ఎస్ & పీ గ్రూప్ అంచనా ప్రకా‌రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7.3%

13) ఉత్తమ పర్యాటక రాష్ట్రం (ఆల్ ఆఫ్ ఫేమ్) లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

14) ఉత్తమ పర్యాటక రాష్ట్రాలలో మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

15) ఇటీవల నీతి ఆయోగ్ భారత్ జలవనరులలో నీటి కాలుష్యం పై విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : “అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా”

16) నీతి అయోగ్ పట్టణ జలవనరులను శుభ్ర పరచడానికి హైదరాబాద్ లోని ఏ చెరువులో ఉపయోగిస్తున్న ఏ పద్దతిని అనుసరించాలని సూచించింది.?
జ : నెక్నాంపూర్ చెరువు (ప్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ ల్యాండ్ పద్దతి)

17) భూమి వైపునకు దూసుకువచ్చే డెమోర్పాస్ గ్రహ శకలాన్ని డీకోట్టిన నాసా పంపిన వ్యోమోనౌక పేరు ఏమిటి.?
జ : DART (డబుల్ అస్ట్రాయిడ్ రీడైరెక్ట్ టెస్ట్)

18) డెమోర్పాస్ గ్రహ శకలం ఏ గ్రహ శకలం చుట్టూ తిరుగుతుంది.?
జ: డిడిమోస్

19) భారత నూతన అటార్నీ జనరల్ (AG) గా ఎవరు నియమితులయ్యారు.? జ : ఆర్. వెంకటరమణి