CURRENT AFFAIRS IN TELUGU 2nd APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 2nd APRIL 2023

1) ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ ఉపాద్యాయ పంచాయతీ సథత్ వికాస్ పురస్కారాలలో పచ్చదనం – పరిశుభ్రత విభాగంలో తెలంగాణ లో ఉత్తమ పంచాయతీ గా నిలిచిన గ్రామం ఏది.?
జ : పర్లపల్లి గ్రామ పంచాయతీ

2) ఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాపన్ (రెడ్ బుల్ టీమ్)

3) స్పెయిన్ మాస్టర్స్ – 2023 బ్యాడ్మింటన్ టోర్నీ రన్నరప్ గా ఎవరు నిలిచారు.?
జ : పీవీ సింధు

4) రీయూజబుల్ లాంచింగ్ వెహికిల్ (RLV) రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో ఎక్కడ ప్రయోగించింది.?
జ : కర్ణాటక

5) కూల్ రూప్ పాలసీ 2023 – 2028 ని ప్రారంభించనున్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

6) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగి ఉన్న దేశం ఏది.?
జ : సింగపూర్

7) లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

8) భారతదేశం ఇటీవల ఏ దేశంతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : రొమేనియా

9) నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ ఏ దేశానికి సంబంధించినది.?
జ : మాయన్మార్

10) 15 సంవత్సరాల పైబడిన నిరక్షరాశులకు వచ్చే ఐదు సంవత్సరాలలో అక్షరాస్యులుగా మార్చడానికి 1,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : ది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం

11) ప్రధాని నరేంద్ర మోడీ 11 వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ను ఎక్కడుంది ఎక్కడికి ప్రారంభించారు.?
జ : భోపాల్ – డిల్లీ

12) ఇటీవల భారత్ ఏ దేశంతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని భారతీయ రూపాయలలో నిర్వహించడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : మలేషియా