CURRENT AFFAIRS IN TELUGU 28 FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 28 FEBRUARY 2023

1) ప్రపంచ ఉత్తమ ఫుట్ బాలర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : లియోనల్ మెస్సి (ఏడవసారి) (అర్జెంటీనా)

2) ప్రపంచ ఉత్తమ మహిళ ఫుట్ బాలర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : అలెక్సియా పుటెలాస్ (స్పెయిన్)

3) ప్రపంచ ఉత్తమ ఫుట్ బాల్ జట్టు కోచ్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : లియోనల్ స్కలోని (అర్జెంటీనా)

4) బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ మహిళల స్నూకర్ టోర్నీ 2023 విజేతగా నిలిచిన దేశం ఏది?
జ : భారత్ (అమీ కమాని – అనుపమ రామచంద్రన్ జోడి)

5) ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక సాంస్కృతిక విభాగం కమిటీ చర్చల్లో పాల్గొన్న నిత్యానంద స్వామి స్థాపించిన దేశం ఏది.?
జ : యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస

6) రష్యా ప్రభుత్వం ఇటీవల ఎవరికి “ఆర్డర్ ఆఫ్ ప్రెండ్స్‌షిప్” అవార్డులను ప్రకటించింది.?
జ : స్టీవెన్ సీగల్, రెక్స్ టిల్లర్సన్, గియాని ఇన్ఫాంటినో

7) గోదావరి – కావేరి నదుల అనుసంధానం కోసం ఎంత మొత్తం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంచనా వేసింది.?
జ :39,275 కోట్లు

8) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి మాసాంతానికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు ఎంతగా నమోదయింది.?
జ : 11.9 లక్షల కోట్లు

9) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 4.4%

10) “స్పోర్ట్స్ స్టార్ అసెస్ – 2023” అవార్డు ఏ ముఖ్యమంత్రికి దక్కింది.?
జ : నవీన్ పట్నాయక్ (ఒడిశా)

11) జి 20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం మార్చి – 1,2వ తేదీలలో ఎక్కడ జరగనుంది.?
జ : న్యూ ఢిల్లీ

12) ఏ దేశం తన దేశాన్ని మెటావర్స్ వర్చువల్ దేశంగా భావితరాలకు అందించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : తువాలు

13) ఏ క్రికెట్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.?
జ : వాంఖడే స్టేడియం (ముంబై)

14) భారత చెస్ క్రీడారంగంలో 81వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
జ : సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)

15) ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ విజయం సాధించింది. ఇలా నెగ్గిన ఎన్నో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.?
జ : మూడవ జట్టు (ఇంగ్లండ్, భారత్ లు)

16) నేచర్ ఇండెక్స్ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో పరిశోధన విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

17) 2023 ఫిబ్రవరి మాసంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు (29.54℃) ఏ సంవత్సరం తర్వాత నమోదయ్యాయి.?
జ : 1877 తర్వాత

18) ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ పేరు ఏమిటి.?
జ : అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీ

19) 1300 ఏళ్ల క్రితం నాటి బౌద్ధ స్తూపాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు.?
జ : బాజ్ పూర్ (ఒడిశా)

20) ఐదు లక్షల ఏళ్ల నాటి ఆయుధాలను ఇటీవల ఏ దేశంలో గుర్తించారు.?
జ : పోలెండ్ (ఓజ్‌సీవ్ జాతీయ పార్క్)

21) ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు విదేశీ సినిమాలు చూస్తే జైలు శిక్ష విధిస్తానని ఉత్తర్వులు జారీ చేశాడు.?
జ : ఉత్తర కొరియా – కిమ్ జోంగ్ ఉన్

22) 2022 అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులనం కైవసం చేసుకున్న తెలంగాణ జిల్లాలు ఏవి.?
జ : త్రీస్టార్ – జగిత్యాల, సిద్దిపేట
ఫోర్ స్టార్ – సిరిసిల్ల, పెద్దపల్లి

23) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసం వరకు తెలంగాణ రాష్ట్ర రాబడి ఎంత.?
జ : 1,54,518 కోట్లు