CURRENT AFFAIRS IN TELUGU 27th FEBRUARY 2023

1) ఎన్నవ బయోఏసియా సదస్సు – 2023 హైదరాబాద్ లో నిర్వహించారు.?
జ : 20వ

2) కొబ్బరి ఉత్పత్తులు వాణిజ్యం మార్కెట్ పై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : హైదరాబాద్

3) కొబ్బరి ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానం (30.93%)

4) ఏ దేశం ఇటీవల బాల్యవివాహాల నిషేధ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.?
జ : ఇంగ్లాండ్

5) భారత్ లో పర్యటిస్తున్న డెన్మార్క్ యువరాజు పేరు ఏమిటి.?
జ : ప్రెడరిక్ అండ్రే హెన్రిక్ క్రిస్టియన్

6) ఇటీవల డెన్మార్క్- భారత్ లకు సంబంధించిన ఏ లోహ పురాతన వస్తువుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
జ : వెండి లోహ వస్తువులు

7) జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైన నటి ఎవరు.?
జ : కుష్బూ

8) ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో రజత పథకం గెలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : మోహన హర్ష

9) స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్ అవార్డు 2023 గెలుచుకున్న తెలంగాణలోని గ్రామపంచాయతీ ఏది.?
జ : ముక్రా (కే) గ్రామ పంచాయతీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి

10) హైదరాబాద్ లోని ఇక్రిశాట్ సంస్థతో ఏ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం

11) తెలంగాణలోని ఏ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోలార్ ఎనర్జీ అవార్డుకు ఎంపిక చేసింది.?
జ : TS SPDCL

12) స్కిమోగా సమస్త ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ నేత్ర వైద్యశాలల్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు ఎన్నో స్థానం దక్కింది
జ : 12వ స్థానం (హర్వార్డ్ మొదటి స్థానం)

13) ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాతిలో ప్రస్తావించిన తెలంగాణ పేరిణి నృత్యకారుడు ఎవరు.?
జ : రాజ్‌కుమార్ నాయక్

14) స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలలో రజత పథకాలు గెలుచుకున్న భారత బాక్సర్లు ఎవరు.?
జ : అనామిక, అనుపమ

15) సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు.?
జ : సుందరేశ్ మీనన్

16) ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మెద్వదేవ్ (ముర్రే పై)

17) ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది?
జ : ఆంధ్రప్రదేశ్

18) పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణలో చేపట్టిన ఏ పథకం గురించి అధ్యయనం చేయనుంది.?
జ : మిషన్ కాకతీయ