CURRENT AFFAIRS IN TELUGU 25th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 25th FEBRUARY 2023

1) 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏ విభాగానికి చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ మహిళల విభాగం తొలిసారిగా పాల్గొంది.?
జ : BSF

2) చనిపోయిన మానవుల మృతదేహాలను సేంద్రియ ఎరువులుగా మార్చే విధానానికి చట్టబద్ధత కల్పించడానికి అమెరికాలోని ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది.?
జ : న్యూయార్క్

3) 83వ సభాపతుల (స్పీకర్స్) సమావేశం ఏ నగరంలో జరిగింది.?
జ : జైపూర్

4) బ్రాండ్ గార్డియన్ షిప్ 2023 సూచిలో రిలయన్స్ సంస్థ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండవ స్థానంలో

5) ఫిబ్రవరి 25, 26వ తేదీలలో భారత్ లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్స్‌లర్ ఎవరు.?
జ : ఓలాఫ్ షోల్జ్

6) అత్యాధునిక ఔషధ, జీవశాస్త్ర సంస్థ అయిన జూబిలెంట్ 1,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏ ప్రాంతంలో తమ సంస్థను స్థాపించనుంది.?
జ : జీనోమ్ వ్యాలీ

7) హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ 2023 అవార్డుల్లో RRR సినిమాకు ఎన్ని అవార్డులు దక్కాయి.?
జ : ఐదు అవార్డులు

8) అంతర్జాతీయ కార్మిక సంస్థ కు ఎక్స్టర్నల్ అధికారిగా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : గిరీష్ చంద్ర ముర్మ్ (CAG)

9) భారత దేశ కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఎవరు.?
జ : జ : గిరీష్ చంద్ర ముర్మ్

10) ఇటీవల సెబి సోషల్ స్టాక్ ఎక్చేంజ్ ఏర్పాటుకు ఏ సంస్థకు అనుమతించింది.?
జ : నేషనల్ స్టాక్ చేంజ్ (NSE)

11) అంతర్జాతీయ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలికిన స్పెయిన్ ఆటగాడు ఎవరు.?
జ : సెర్జియో రామోస్

12) MPLADS పూర్తి నామం.?
జ : Member of Parliament local area development scheme

13) మోహిని అట్టం నృత్యంలో ప్రసిద్ధి చెందిన.. పద్మ విభూషణ్ గ్రహీత నాట్యకారిణి ఇటీవల మరణించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : డా. కనక్ రేలే

14) అంతర్జాతీయ మాతృభాష అవార్డు 2023ను ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు.?
జ : డా. మహేంద్ర మిశ్రా (ఒడిశా)

15) స్థానిక భాషలలో తమ తీర్పులను వెలువరిస్తున్న మొదటి హైకోర్టుగా ఏ రాష్ట్ర హైకోర్టు నిలిచింది.?
జ : కేరళ హైకోర్టు

16) ‘ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2023 సదస్సు’ ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు ఎక్కడ నిర్వహించారు.?
జ : పూణే నగరంలో

17) ఉబేర్, ఓలా‌, రాపిడో బైక్ టాక్సీ లను నిషేధించిన నగరం ఏది.?
జ : న్యూఢిల్లీ

18) 2023లో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ లో కలిగి ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 85వ స్థానం

19) ఇటీవల ఏ దేశానికి చెందిన న్యాయస్థానాలు హోమోసెక్సువల్ జంటలకు హక్కులు కల్పించారు.?
జ: దక్షిణ కొరియా