CURRENT AFFAIRS IN TELUGU 24th FEBRUARY 2023
1) మహిళల టి20 ప్రపంచ కప్ 2023లో ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : ఆస్ట్రేలియా & దక్షిణాఫ్రికా
2) ఖతార్ ఓపెన్ ఏటిపి 250 టెన్నిస్ టోర్నీలో పురషుల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న జోడి ఏది.?
జ : రోహన్ బోపన్న – ఎబ్డేన్ జోడి
3) స్టాన్ పోర్డ్ యూనివర్సిటీ ‘ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ నివేదిక’ ప్రకారం నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తున్న జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?.
జ : పంజాబ్ ( కేరళ రెండవ స్థానం, ఆంధ్రప్రదేశ్ 29, తెలంగాణ 34వ స్థానం)
4) టెస్ట్ క్రికెట్ లో మొదటి తొమ్మిది ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వినోద్ కాంబ్లీ (798) పేరు మీద ఉన్న రికార్డును ఏ క్రికెటర్ బ్రేక్ చేశాడు.?
జ : హ్యారీ బ్రూక్ (807) ఇంగ్లాండ్
5) మహారాష్ట్రలోని ఔరంగబాద్, ఉస్మాన్ బాద్ నగరాల పేర్లను ఏమని మార్చారు.?
జ : ఔరంగాబాద్ ను – చత్రపతి శివాజీ నగర్… ఉస్మాన్ బాద్ ను — ధారాశివ్ గా మార్చారు
6) భారత్ కు సంఘీభావంగా ఆర్థిక సహాయం చేయుటకు ప్రవాస భారతీయులు ‘ఇండియా గివింగ్ డే’ ను ఏ రోజున నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : మార్చి 2
7) గగన్ యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడానికి ‘సిమ్ములేటెడ్ క్రూ మాడ్యూల్’ ను తయారుచేసిన సంస్థ ఏది.?
జ : మంజీరా మెషిన్ బిల్డర్స్ (తెలంగాణ)
8) నూతన ఆవిష్కరణల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ‘వై హబ్’ అనే సంస్థను ఏర్పాటు చేయనుంది.?
జ : యూనిసెఫ్
9) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెల్త్ కేర్ – లైఫ్ సైన్సెస్ కేంద్రాన్ని కేంద్రం సహకారంతో ఎక్కడ నెలకొల్పుతుంది.?
జ : హైదరాబాద్
10) ఫోటోగ్రఫీ రంగానికి చెందిన ప్రపంచ ప్రతిష్టాత్మక హసెల్ బ్లాడ్ పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయురాలు.?
జ : దయనిత సింగ్
11) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ఢిల్లీలో జనవరి 23, 24 తేదీల్లో రక్షణ శాఖ, కేంద్ర గిరిజన శాఖలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాల పేరు ఏమిటి.?
జ : ఆది సౌర్య
12) అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం – 2023 ప్రారంభ వేడుకలను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఏ నగరంలో నిర్వహించింది.?
జ : రోమ్ (ఇటలీ)
13) బయో ఎసియా సదస్సులో ఎక్సలెన్స్ అవార్డును ఎవరికి అందజేశారు.?
జ : మోడెర్నా లాంగర్
Comments are closed.