CURRENT AFFAIRS IN TELUGU 18th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 18th MARCH 2023

1) ఏటీపీ మాస్టర్స్ 1000 ఛాంపియన్స్ టోర్నీ విజేతగా నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా ఎవరు నిలిచారు.?
జ : రోహన్ బోపన్న

2) ఇండియన్ వేల్స్ పురుషుల డబుల్స్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు.?.
జ : రోహన్ బోపన్న & మాథ్యూ ఎబ్డన్

3) డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపకుడు, చిరుధాన్యాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : పివి సతీష్

4) ప్రతిష్టాత్మక స్లోన్ రీసెర్చ్ ఫెలోషిప్ (62 లక్షల) కు అర్హత సాధించిన హైదరాబాదుకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు?
జ : నేరెళ్ల తేజస్వి వేణు యాదవ్

5) ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఎన్నో జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 12న నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : 200వ

6) భారత వాతావరణ గణాంక శాఖ నివేదిక ప్రకారం 2022వ సంవత్సరం… 1901 నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : ఐదవ స్థానం

7) ఏసియన్ బిలియర్డ్స్ ట్రోఫీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ ; పంకజ్ అద్వానీ

8) ఒలంపిక్స్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్ లు ఎవరు.?
జ : వికాస్ సింగ్, పరమ్‌జీత్‌సింగ్ బిస్త్

9) బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఏప్రిల్ 1 నుండి ఎన్ని అంకెల హోల్ మార్కును భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : ఆరు అంకెల యు హెచ్ ఐ డి

10) వందే భారత్ రైలు యొక్క మొదటి మహిళా లోకో పైలట్ గా ఎవరు నిలిచారు.?
జ : సురేఖా యాదవ్

11) మహిళల అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఫరాహాన్ అక్తర్

12) అత్యంత కాలుష్య బారిన పడిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఎనిమిదవ స్థానం