Home > EMPLOYEES NEWS > 58 ఏండ్లు దాటిన 23 మంది లెక్చరర్ల కొనసాగింపు

58 ఏండ్లు దాటిన 23 మంది లెక్చరర్ల కొనసాగింపు

హైదరాబాద్ (సెప్టెంబర్ 06) : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 58 ఏళ్ళు వయసు దాటిన 23 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఎంటీఎస్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.Contract lecturers retirement age now 61 in telangana

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం 61 ఏండ్ల వయసు వచ్చే వరకు వీరు విధులు నిర్వర్తిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయం పట్ల ఇంటర్మీడియట్ విద్య లెక్చరర్ల సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. రెగ్యులర్ కాకుండా మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా త్వరగా క్రమబద్దీకరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.