విజయవాడ (డిసెంబర్ – 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాల ఉత్తర్వులను (contract employees regularization guidelines in ap) విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 15వ తేదీ నుండి క్రమబద్ధీకరణకు అర్హులైన ఉద్యోగులు క్రమబద్ధీకరణ కొరకు రూపొందించిన సాఫ్ట్ వేర్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సంక్రాంతి లోపు కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరణ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. జూన్ 2 2014 కంటే ముందు సర్వీస్ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగుల సంఘ నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.