CHESS – 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలీ

హైదరాబాద్ (డిసెంబర్ – 03) : భారత చెస్ క్రీడాకారిణి, ప్రజ్ఞానందా సొదరి వైశాలి రమేష్ బాబు గ్రాండ్ మాస్టర్ హోదాను (chess grand master visashali) అందుకుంది. భారత తరఫున ఈ ఘనత సాధించిన 84వ చెస్ క్రీడా కారినిగా వైశాలి గుర్తింపు పొందింది. భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మూడో మహిళ చెస్ క్రీడాకారిణి వైశాలి కావడం విశేషం.

ఇప్పటికే ప్రపంచ చెస్ లో సంచలనాలతో పేరు తెచ్చుకున్న గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందాకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. ప్రజ్ఞనంద 2018 లోనే గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోనేరు హంపి 2002లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కే చెందిన ద్రోణవల్లి హారిక 2011లో గ్రాండ్ మాస్టర్ సాధించిన రెండో భారత మహిళాగా రికార్డు సృష్టించింది.