BSc Bio Medical Science -డిగ్రీలో కొత్తగా బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌ కోర్సు

BIKKI NEWS (APRIL 10) : డిగ్రీలో కొత్తగా బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌ కోర్సును తెలంగాణ ఉన్నత విద్యామండలి అందుబాటులోకి (bsc bio medical science course in degree) తేనున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రాథమికంగా రాష్ట్రంలోని 20 అటానమస్‌ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభిస్తారు.

ఈ కోర్సులకు దోస్త్‌ 2024 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏలో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (బయో మెడికల్‌) కోర్సును కొన్ని వర్సిటీల్లో నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌లోనూ బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సును నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ డిగ్రీలోను ఈ కోర్సును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

కోర్సు రూపకల్పన, కరికులం తయారీకి ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించి నిపుణులతో చర్చలు జరిపారు. బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిపుణులతో మరోమారు సమావేశం కానున్నారు.