PAKvsBAN : పాకిస్థాన్ ఘనవిజయం – బంగ్లాదేశ్ ఔట్

కోల్‌కతా (అక్టోబర్ – 31) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్థాన్ (PAKvsSA) జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఏడు మ్యాచ్ లలో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన బంగ్లాదేశ్ జట్టు సెమీస్ చేరే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.

బంగ్లాదేశ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా పాకిస్థాన్ చేదించి సెమిస్ రేసులో ఇంకా తన అవకాశాలను నిలబెట్టుకుంది. ఫకర్ జమాన్ 81, అబ్దుల్లా షఫీక్ 68 పరుగులతో రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 2004 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది మహమ్మదుల్లా 56, లిటన్ దాస్ 45 పరుగులతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అప్రీదీ, మొహమ్మద్ వసీం జూనియర్ చెరో 3 వికెట్లతో రాణించారు.

ఈ గెలుపు తో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ – 5వ, బంగ్లాదేశ్ – 9వ స్థానాలలో నిలచాయి.