Home > SPORTS > ASIA CUP 2023 : ఆసియా కప్ విజేత భారత్

ASIA CUP 2023 : ఆసియా కప్ విజేత భారత్

కొలంబో (సెప్టెంబర్ 17) : ASIA CUP 2023 WINNER INDIA మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్ జట్టు 8వ సారి టైటిల్ విజేతగా నిలిచి వరల్డ్ కప్ కు సగర్వంగా వెళ్ళనుంది.

కేవలం 6.1 ఓవర్లలనే లక్ష్యం ఛేదించి రికార్డు విజయంతో ఆసియా కప్2023 ను భారత్ గెలుపొందింది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మహ్మద్ సిరాజ్ నిలువగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా కులదీప్ యాదవ్ నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పీడ్‌స్టర్ ల ధాటికి శ్రీలంక కుప్పకూలింది..

సిరాజ్ ఒకే ఓవర్లలో 4 వికెట్లు తీయడంతో పాటు మొత్తం ఇప్పటికే 6 వికెట్లు తీశాడు. హర్దీక్ పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ తీశారు.

15.2 ఓవర్లలోనే ఆలౌట్ అయినా శ్రీలంక… తక్కువ ఓవర్లలో ఆలౌట్ అయినా రెండో టీమ్ గా నిలిచింది. 2017 లో జింబాబ్వే 13.5 ఓవర్లలో నే అప్ఘనిస్తాన్ పై ఆలౌట్ అయింది.

అంతర్జాతీయ వన్డే టోర్నీ ఫైనల్స్ లలో అతి తక్కువ స్కోర్ (50) కావడం విశేషం.

భారత్ జట్టు ఒక జట్టు ను అతి తక్కువ స్కోర్ కు ఆలౌట్ చేయడంలో ఇదే రికార్డు. 2014 లో బంగ్లాదేశ్ జట్టు ను 58 పరుగులకు ఆలౌట్ చేసింది.

శ్రీలంక రెండో అతి తక్కువ స్కోరును నమోదు చేసింది. 2012లో దక్షిణాఫ్రికాపై చేసిన 43 పరుగులు శ్రీలంక అంతర్జాతీయ వన్డేల్లో చేసిన అతి తక్కువ స్కోరు.